రెండు కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు….

ఇండియాలో రెండు కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు వ‌చ్చాయి. న‌లుగురికి సౌతాఫ్రికా వేరియంట్ క‌రోనా సోక‌గా, ఒక‌రికి బ్రెజిల్ వేరియంట్ సోకిన‌ట్లు ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. విదేశాల నుంచి వ‌చ్చిన ఈ ఐదుగురినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పింది. ఇప్ప‌టికే యూకే వేరియంట్ కేసులు 187 ఉన్న‌ట్లు కేంద్రం తెలిపింది. సౌతాఫ్రికా వేరియంట్ 41 దేశాల‌కు, యూకే వేరియంట్ 82 దేశాల‌కు వ్యాపించింది.