దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెండో ద‌శ ఉధృతి…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెండో ద‌శ ఉధృతి. రోజురోజుకు మ‌రింత పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం ఉద‌యానికిక‌ల్లా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 23,285 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. 117 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. అయితే ఈ 23 వేల పైచిలుకు కొత్త కేసుల్లో మెజారిటీ కేసులు కేవ‌లం ఆరు రాష్ట్రాల్లోనే న‌మోద‌య్యాయి. కొత్త కేసుల్లో 85.6 శాతం కేసులు మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనే బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, ఆ ఆరు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ‌ వెల్ల‌డించింది. అందుకే ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ విస్త‌రిస్తున్న తీరు, చేప‌డుతున్న ప్ర‌జారోగ్య కార్య‌క్ర‌మాల‌పై తాము నిరంత‌ర స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని కేంద్ర స‌ర్కారు తెలిపింది.