తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్..

ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 39,726 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కి చేరింది. ఇందులో 1,10,83,679 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,71,282 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 154 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,59,370 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది