భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదు.!!.

దేశంలో కొవిడ్‌ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,240 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 40% పెరిగాయి. నిన్న ఒక్కరోజే మరో 8 మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32,498 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 4,31,97,522 మంది కరోనా బారినపడ్డారు…