దేశవ్యాప్తగా మంగళవారం 18,346 మంది కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 18,346 మంది కరోనా బారినపడగా, కొత్తగా దానికంటే ఎక్కువగా మరో ఐదు వందల మందికి వైరస్‌ సోకింది. అయితే యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. తాజాగా అవి 203 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి చేరింది. ఇందులో 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,49,538 మంది మృతిచెందారు. మరో 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 203 రోజుల తర్వాత ఇంత తక్కువకు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.ఇక గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 278 మంది మృతిచెందారు. కాగా, దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 5 నాటికి 57,68,03,867 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. ఇందులో మంగళవారం ఒక్కరోజే 14,09,825 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది..