కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోండి: డీహెచ్‌.

రానున్న మూడు నెలలు పండగల సీజన్‌ అని.. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని.. ఎవరికైనా లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగల సీజన్‌లో షాపింగ్‌లు, విందులకు వెళ్లేవాళ్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలన్నారు. వైరస్‌ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అందరికీ సోకుతుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.