తెలంగాణ లో కరోనా నిర్థారణ పరీక్షల బులిటెన్‌ విడుదల.

R9TELUGUNEWS.com: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 22,650 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 106 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,72,052కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,961కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,879 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ..