దేశంలొ కొత్తగా 10,853 కరోనా కేసులు..

కొత్తగా 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి. ఇందులో 3,37,49,900 మంది కరోనా నుంచి బయటపడగా, 4,60,791 మంది బాధితులు మరణించారు. మరో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 260 రోజుల్లో కనిష్టమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది…గత 24 గంటల్లో కొత్తగా 12,432 మంది కోలుకున్నారని, 526 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల రేటు 0.42 శాతం, మరణాల రేటు 1.34 శాతం, కోలుకున్నవారి రేటు 98.24 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 1,08,21,66,365 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.