బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ..!

R9TELUGUNEWS.COM
బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరంతా నిన్న, ఇవాళ యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో వీరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో 12 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.