ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్….

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మధ్యలోనే ప్రస్తుతం అన్ని విద్య సంస్థలు నడుస్తున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. కరీంనగర్ లోని ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరికొంత మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక కళాశాలలో ఒక్కేసారి ఇన్ని కరోనా కేసులు రావడంతో సెలవులు ప్రకటించింది యాజమాన్యం. అయితే గత ఆదివారం రోజు జరిగిన కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కరోనా బారిన పడ్డట్టు సమాచారం..