దేశాల నుంచి రాష్ట్రానికి 1805 మంది వచ్చారు..,అందులో 13 మందికి పాజిటివ్…

విదేశాల నుంచి వ‌చ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని హ‌రీష్ రావు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ లో వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క‌రోనా కేసులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, వ్యాక్సినేష‌న్‌ను అధికారులు మంత్రి హ‌రీష్‌రావుకు వివ‌రించారు…ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి 1805 మంది వ‌చ్చార‌ని, అందులో 13 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంప‌గా 13 మందికి నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు అధికారులు వివ‌రించారు. నెలాఖ‌రులోగా 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని హ‌రీష్‌రావు అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని హ‌రీష్ రావు సూచించారు.