మరోసారి కరోనా బారిన పడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

R9Telugunews.com: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే ముందు ఆయనకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వెంకయ్యకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు ఉపరాష్ట్రపతి స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. 2020 సెప్టెంబర్‌లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకింది.