గత 24గంటల్లో 2,34,281 కొత్త కేసులు…

R9TELUGUNEWS.COM… దేశంలో కొవిడ్‌ మూడో ఉద్ధృతిలో కాస్త ఊరటనిచ్చేలా..
రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. గత 24గంటల్లో 2,34,281 కొత్త కేసులు బయటపడగా.. 893 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4,10,92,522కు, మరణాలు 4,94,091కి పెరిగాయి. ప్రస్తుతం 18,84,937 మంది ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తాజాగా మరో 3.52లక్షల మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 165.70కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.