తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,646 మందికి కరోనా పాజిటివ్‌…

r9telugunews.com: తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 88,206 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,646 మందికి పాజిటివ్‌ అని తేలింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. మహమ్మారి బారి నుంచి నిన్న ఒక్కరోజే 3,603 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34,665 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 94. 96 శాతంగా ఉంది.