భారత్​లో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు..

భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు.దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం మరణాలు 5లక్షల ఒక వెయ్యి 114 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13లక్షల 31,648 మంది. ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారు 4,02,47,902 మంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వివిధ రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే, ముప్పు ఇంకా పొంచి వుందని, జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.