దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసులు తగ్గుముఖం..

R9Telugunews.COM దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 44,877 మంది కొవిడ్‌ బారిన పడగా.. 1,17,591 మంది కోలుకున్నారు. 684 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.26కోట్లు దాటగా.. మహమ్మారి బారిన పడి ఇంతవరకు 5,08,665 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 5,37,045 (1.26%)కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17%కి తగ్గింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 172.81 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు. శనివారం 14,15,279 కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.