తెలంగాణ రాష్ట్రంలొ కొత్తగా 614 పాజిటివ్‌ కేసులు..

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 614 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 131, మేడ్చల్-మల్కాజిగిరి 48, రంగారెడ్డి 43, ఖమ్మం 31 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా బారి నుంచి తాజాగా 2,387 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,908 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.