కరోనా వ్యాప్తి 24 గంటల వ్యవధిలో 201 మరణాలు..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండోరోజు 7 వేల దిగువనే నమోదైన కేసులు.. తాజాగా ఇంకాస్త తగ్గాయి. గురువారం 9 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,396 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఒక శాతం దిగువకు చేరిన పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.69 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో 201 మరణాలు నమోదయ్యాయి. నిన్నటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,14,589 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.ఇక నిన్న 13,450 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు(98.64 శాతం) దాటాయి. క్రియాశీల కేసులు 69,897(0.16 శాతం)కి తగ్గిపోయాయి. నిన్న 24,84,412 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి..