చైనా,దక్షిణ కొరియా దేశాల్లో కరోనా విజృంభిస్తుంది…. చైనాలో పెరుగుతున్న మరణాలు….

కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది…మహమ్మారి ప్రపంచ దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనా,దక్షిణ కొరియా దేశాల్లో కరోనా విజృంభిస్తుంది… దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు నమోదు తీవ్రతరం అవుతున్నాయి…. దక్షిణ కొరియాలో మాత్రం రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది… కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాంతో భారత్ కు ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదన్న హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి…చైనాలో కరోనా మరణాలు కూడా నమోదైనట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంగా ఒక్క కరోనా మరణం లేని చైనాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. జిలిన్ ప్రావిన్స్ లో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కరోనాపై విజయం సాధించిన చైనాలో.. రెండేళ్ల తర్వాత కేసులు నమోదవుతుండటంతో.. సుమారు 13 నగరాల్లో లాక్ డౌన్ విధించారు అధికారులు. పలు నగరాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కాగా.. ప్రపంచ దేశాల్లో తాజా పరిణామాలను చూస్తుంటే.. ఫోర్త్ వేవ్ రావొచ్చన్న హెచ్చరికలను కొట్టిపారేయలేమంటున్నారు అధికారులు.