తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల..

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,444 కరోనా పరీక్షలు నిర్వహించగా 49 మందికి పాజిటివ్ గా నిర్ధారణయింది. అత్యధికంగా హైదరాబాదులో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 67 మంది కరోనా నుంచి కోలుకోగా మరణాలేవీ సంభవించలేదు. ఇంకా 619 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,038 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 7,86,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. అలాగే 4,111 మంది కరోనాతో మరణించారు.