చైనాలో కరోనా తీవ్ర రూపం…. ఇంటి నుండి బయటికి రావద్దు… కనీసం పెంపుడు కుక్కలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేందు…!!!

చైనాలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. వివిధ నగరాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలు ప్రారంభించింది స్థానిక యంత్రాంగం. ముఖ్యంగా చైనా ఆర్థిక రాజధాని, అత్యధిక జనాభా ఉన్న షాంఘైలో లాక్​డౌన్ విధించింది స్థానిక యంత్రాంగం. రోజువారీ సగటు కేసుల సంఖ్య 4,400 దాటిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది స్థానిక ప్రభుత్వం.. ఈ నిర్ణయంతో దాదాపు 2.6 కోట్లమంది వరుసగా రెండో రోజు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించడం జరిగింది…ఇక షాంఘైలో మాస్ టెస్టింగ్ జరగుతోందని అధికారులు వెల్లడించారు. నగరంలో మొత్తం 17,000 మంది హెల్త్​కేర్ వర్కర్లు టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 82 లక్షల మందికి టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు…..చాలా ప్రాంతాల్లో ఇళ్లను వదిలి ప్రజలు బయటకు రావడం లేదని తెలిసింది. ఇదిలా ఉండాగా.. మరికొంత మంది మాత్రం తమ కాంపౌట్లలో తిరిగుతు కనిపించారని స్థానికులు కొంతమంది మీడియాతో చెప్పినట్లు వెల్లడైంది. అయితే అధికరులు మాత్రం ఆపర్ట్​మెంట్​లలో ఉండే వారెవ్వరూ తమ ఇంట్లో నుంచి బయటకుకు రావద్దని అధికారులు సూచించారు. కనీసం పెంపుడు కుక్కలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు….