కొవిడ్‌తో జర్మనీలో పరిస్థితి ఆందోళనకరం.

కొవిడ్‌తో జర్మనీ విలవిల.. గరిష్ఠానికి ఇన్‌ఫెక్షన్‌ రేటు!

యూరప్‌లో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇదే అత్యధికం. జర్మన్‌ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది….జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో 40 శాతం మందికి మాత్రమే రెండు డోసులు పూర్తయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ సైతం దేశంలో మహమ్మారి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్‌ కట్టడి విషయమై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని, వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, ఇండోర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మరోవైపు.. దేశంలో కరోనా పరిస్థితులను నియంత్రించేందుకుగానూ ఫెడరల్ ప్రభుత్వం వచ్చేవారం స్థానిక 16 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం కానుంది…