భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ టీకా ధరలను వెల్లడి..

భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ టీకా ధరలను వెల్లడించింది. ప్రైవేటు హాస్పిటళ్లకు రూ. 800 (ట్యాక్సులు అదనం)కు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. అదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బల్క్ కొనుగోళ్లకు డోసుకు రూ. 325 చొప్పున విక్రయిస్తామని వివరించింది. తాము తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి నాలుగో వారంలో నాజల్ వ్యాక్సిన్ ఇన్కోవ్యాక్‌ను అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ముక్కు ద్వారా వేసే ఈ ఇన్కోవ్యాక్ నాజల్ టీకాను 18 ఏళ్లు పైబడిన అర్హులైనవారికి బూస్టర్ డోసుగా అందిస్తారు.