దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదు…

715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారి...

దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నాటికంటే 16 శాతం తక్కువ అని వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 4,30,29,044కు చేరారు. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకోగా, 5,21,358 మంది మృతిచెందారు. మరో 12,597 మంది చికిత్స పొందుతున్నారు…యాక్టివ్‌ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 13 మంది వైరస్‌కు బలవగా, 1316 మంది కోలుకున్నారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉందని, యాక్టివ్‌ కేసులు 0.03 శాతం, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,84,70,83,279 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది…