భారత్ లో కొత్తగా 2,710 కరోనా కేసులు నమోదు….

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి.గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,710 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. 2,296 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కొద్దిరోజులుగా పెరుగుతోన్న కొత్త కేసుల ప్రభావం బాధితుల సంఖ్యపై పడుతోంది. దాంతో క్రియాశీల కేసులు 15,814(0.04శాతం)కి చేరాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా.. 4.26 కోట్ల మంది వైరస్‌ను జయించడంతో రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. నిన్న 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 192 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 14.41 లక్షల మంది టీకా వేయించుకున్నారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.