దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు…

*న్యూఢిల్లీ..భారతదేశంలో గత 24 గంటల్లో 3 వేల 823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది..

ప్రస్తుతం కేసుల సంఖ్య 16 వేల 354 కి పెరిగాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులు గతంలో కంటే ఇవాళ్టితో పోలిస్తే 27% పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

3,824 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది. శుక్రవారం, దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు 3,095.. శనివారం 2995 వద్ద ఉంది. ఇంతలోనే కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతుంది..