కోవిడ్ టీకా వేయించుకున్నా కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి..

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖానాలో ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో టీకాలు ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీకా తీసుకునే స‌మ‌యంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా అక్క‌డే ఉన్నారు. హైద‌రాబాద్‌లోని భార‌త్‌బ‌యోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయ‌న వేయించుకున్నారు.