సైబర్ కుట్రలకు చైనా ప్లాన్.. వ్యాక్సిన్ కంపెనీలను అప్రమత్తం చేసిన కేంద్రం.

సైబర్ కుట్రలకు చైనా ప్లాన్.. వ్యాక్సిన్ కంపెనీలను అలర్ట్ చేసిన కేంద్రం*

చైనా వంకర బుద్ది మారటం లేదు. ప్రపంచదేశాలపై ఆదిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తోంది చైనా. భారత్ ను డైరెక్ట్ గా ఢి కొట్టలేని చైనా..దేశంలోని ముఖ్యమైన మౌలికవసతుల ప్రాజెక్టులపై సైబర్ దాడులకు ప్లాన్ చేస్తోంది. గతంలో బోర్డర్ లో దాడలు చేస్తున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్తున్నారు భారత సైనికులు. దీంతో ఏం చేయలేని చైనా మనపై ఇన్ డైరెక్ట్ గా దాడికి ప్లాన్ చేస్తోంది. ఇండియన్ కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. భారత్ లోని ముఖ్యమైన కంపెనీలపై సైబర్ దాడులకు కుట్ర చేస్తోంది. అయితే దేశంలోని ముఖ్యమైన మౌలికవసతుల ప్రాజెక్టులన్నింటిపై సైబర్ దాడి ప్రయత్నం జరిగిందని హెచ్చరించారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు. హ్యాకింగ్ టెన్షన్ తో రాష్ట్ర విద్యుత్ సంస్థలు అలర్ట్ అయ్యాయి. సంస్థ వెబ్ సైట్ కు సంబంధించి ఉద్యోగుల ఐడీ, పాస్ వర్డ్ లు మార్చేశాయి.అటు కరోనా వైరస్ తో ప్రపంచాన్ని వణికించిన డ్రాగెన్ దేశం… ఇప్పుడు వ్యాక్సిన్ కంపెనీలను కూడా వదలటం లేదు. మన దేశంలోని సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఐటీ సిస్టమ్ ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాక్సిన్ కంపెనీలను అలర్ట్ చేసింది కేంద్రం. దీంతో దేశంలోని వ్యాక్సిన్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. సైబర్ ఎటాక్ ఇష్యూపై అటు అమెరికా కూడా సీరియస్ అయ్యింది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు.. హ్యాకింగ్ పై వచ్చిన కథనాలపై చైనా ఎంబసీ అధికారులు రియాక్ట్ అయ్యారు. తాము సైబర్ దాడులకు కారణమన్న వాదనలో నిజం లేదన్నారు.