వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు సృష్టించింది…ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్.

వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు సృష్టించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భారత్ చరిత్రను సృష్టించిందని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. దేశ శాస్త్ర, సాంకేతిక విజయానికి మనం సాక్షులుగా నిలిచామన్నారు. ఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. వ్యాక్సినేషన్‌లో కీలక పాత్ర పోషించిన డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…నిన్న సాయంత్రం వరకు 99.7 కోట్ల డోసులు పంపిణీ చేసింది. నేడు 100 కోట్ల డోసులు పంపిణీ చేసింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది…275 రోజుల్లోనే 100 కోట్ల డోసుల ల్యాండ్ మార్క్ ను చేరుకుంది. రోజుకు 27 లక్షల డోసుల చొప్పున భారత్ లో టీకా పంపిణీ జరిగింది. ప్రస్తుతం భారత్ సెకన్ కు 700 డోసుల చొప్పున వేస్తోంది. 100 కోట్ల డోసులకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తమవుతోంది…ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎర్ర కోట వద్ద 1400 కిలోల త్రివర్ణ పతాక ప్రదర్శన ఉంటుంది.
100 కోట్ల డోసుల పంపిణీ లక్ష్యాన్ని చేరిన సందర్భంగా ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, నౌకల్లో, మెట్రోల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై కైలాష్ కెహర్ రాసిన పాటను ఆవిష్కరించనున్నారు.