కోవిడ్‌ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశం. ..

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ శాస్త్రవేత్తలు ఏదోవిధంగా అదుపుచేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు..కరోనా వైరస్‌ చికిత్స కోసం అమెరికన్‌ కంపెనీ మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ మొదటిసారిగా టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మెర్క్‌ కంపెనీ తయారు చేసిన మోల్నుపిరవిర్‌ టాబ్లెట్‌కు బ్రిటన్ మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది..కరోనా నుంచి బయట పడేందుకు దేశాలు తమతమ శాస్త్రవేత్తలు కనుగొన్న కోవిడ్‌ టీకాలను ప్రజలకు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్‌ చికిత్స కోసం టాబ్లెట్‌ అందుబాటులోకి వచ్చింది. కరోనా బారిన పడి సమయంలో ఈ మాత్రను ఉపయోగించేందుకు దీనిని తయారు చేశారు.
ప్రముఖ ఫార్మా సంస్థ మెర్క్‌ ఈ టాబ్లెట్‌ను రూపొందించగా.. యూకే ప్రభుత్వం ఈ టాబ్లెట్‌ కు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా కోవిడ్‌ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే మరో మైలురాయిని సొంతం చేసుకుంది.