వ్యాక్సినేషన్‌ రూల్స్‌.. నో వ్యాక్సిన్‌.. నో రిక్రూట్‌మెంట్‌..!

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా.. వ్యాక్సినేషన్‌తో చెక్‌ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే నో వ్యాక్సిన్‌.. నో ఎంట్రీ..! నో వ్యాక్సిన్‌.. నో సాలరీ..! నో వ్యాక్సిన్‌.. నో జర్నీ..! లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా సంస్థలు.. ఉద్యోగి మాత్రమే కాదు.. అతని కుటుంబసభ్యులు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే జీతం ఇచ్చేది అంటూ పలు ప్రభుత్వ శాఖలతో పాటు.. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.. ఐటీ సంస్థల్లోనూ ఇది కొనసాగుతోంది.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుంటే జీతాల కట్టింగ్‌.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్‌ దిగ్గజం గూగుల్‌ నిర్ణయం ప్రకటించిన తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. ఇప్పుడు ఇది కొత్త రిక్రూట్‌మెంట్‌కు కూడా వర్తింపచేస్తున్నాయి కొన్ని సంస్థలు..గూగుల్‌ తర్వాత ఇప్పుడు ఇంటెల్‌ కంపెనీ తన ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చింది.. 2022 జనవరి 4వ తేదీలోగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని ఆదేశించింది.. లేకపోతే వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు.. దాని మినహాయింపు కోసం అవసరమైన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్‌, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్‌ సంస్థ… వ్యాక్సినేషన్‌ నిబంధనలను ఉల్లంఘించినవారికి 3 నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించకపోతే ఉద్యోగం నుంచి తొలగించేందేకు కూడా వెనుకాడేది లేదని చెబుతున్నారు.. ఇక, హైదరాబాద్‌లోనూ వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలని ఐటీ కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి.. అంతేకాదు.. ఐటీ కంపెనీలు, ఇతర చిన్న కంపెనీలు కూఏడా ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్‌ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే సంస్థలో ఉన్న ఉద్యోగుల విషయంలోనే కాదు.. కొత్త రిక్రూట్‌మెంట్‌లోనూ కఠినంగా వ్యాక్సినేషన్‌ రూల్స్‌ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఐటీ, కార్పొరేట్‌, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌కు ప్రత్యేకంగా ఓ కాలం కేటాయిస్తున్నారంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నారు అర్థం అవుతుంది.. అంతే కాదు.. ఇంటర్వ్యూ సమయంలో.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను కూడా సమర్పించాల్సి ఉంటుందట. మొత్తంగా వ్యాక్సినేషన్‌పై అందరినీ మరింత అప్రమత్తం చేసేందుకు ఇది కూడా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు..