దేశంలో మరో రెండు కొత్త కొవిడ్ వ్యాక్సిన్ లకు అనుమతి..

R9TELUGUNEWS.COM.
దేశంలో మరో రెండు కొత్త కొవిడ్ వ్యాక్సిన్లు,
ఒక ఔషధం అత్యవసర వినియోగానికి మార్గం సుగమమైంది. టీకాలు రెండూ వ్యాధి నుంచి ముందస్తు రక్షణ ఇచ్చేవి. ఇక నోటి ద్వారా తీసుకునే మోల్నుపిరావిర్ ఔషధం మాత్రం..కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) రూపొందించిన కొవొవ్యాక్స్, బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కు అనుమతులు మంజూరు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నిపుణులు కమిటీ సూచించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అమెరికాకు చెందిన నొవొవాక్స్ నుంచి టీకా టెక్నాలజీని పొందిన ఎస్ఐఐ.. కొవొవాక్స్ ను ఉత్పత్తి చేసింది. కొవొవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. బ్రిటన్, అమెరికాల్లో ఈ వ్యాక్సిన్ పై చేపట్టిన క్లినికల్ టెస్టుల ఫలితాలకు సంబంధించిన డేటాను జత చేసింది. వీటిని పరిశీలించిన సీడీఎస్సీవో బృందం.. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయొచ్చని సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బెవాక్స్ కు అనుమతిని ఇచ్చింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకోనుంది.కాగా, దేశీ వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని సీడీఎస్సీవో ఔషధం మోల్నుపిరావిర్. ఈ మెడిసిన్ ను కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 5 రోజుల డోసేజ్ గా ఇవ్వాలని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు 93 కు పైన ఉన్న వారికే ఈ ఔషధాన్ని సిఫార్సు చేయనున్నారు. ఆరంభంలో ఇవ్వడం వల్ల వైరస్ విస్తరణను బలంగా అడ్డుకుంటున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. దేశీయంగా 8 ఫార్మా కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి…