బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు విక్రయించేందుకు అనుమ‌తి…

భార‌త్‌లో దేశీయంగా త‌యారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు అనుమ‌తి ఇచ్చిన ప్ర‌భుత్వం.. ఇత‌ర దేశాల‌కు కూడా స‌ర‌ఫ‌రా చేసింది.. ఇక‌, ఇప్పుడు విస్తృతంగా వ్యాక్సినేష‌న్ జ‌ర‌గుతోంది.. ఈ స‌మ‌యంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు అనుమ‌తి ఇచ్చింది భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ).. అయితే కొన్ని ష‌ర‌తులు కూడా విధించింది.. ఇక‌, డీసీజీఐ నుంచి అనుమ‌తులు ల‌భించిన త‌రుణంలో ఫార్మా సంస్థలు ఈ వ్యాక్సిన్ల‌ను విక్ర‌యించ‌నున్నాయి.. అయితే, వీటి ధ‌ర‌ను నిర్ణ‌యించాల్సి ఉంది.కొత్త డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్, 2019 ప్రకారం ఈ వ్యాక్సిన్ల‌కు డీసీజీఐ ఆమోదం లభించింది. షరతుల ప్రకారం, సంస్థలు కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ మరియు ప్రోగ్రామాటిక్ సెట్టింగ్ కోసం సరఫరా చేయాల్సిన టీకాల డేటాను సమర్పించాలి. ఇక‌, రోగనిరోధకత తర్వాత వచ్చే ప్రతికూల ప‌రిస్థితుల‌ను పర్యవేక్షించడం కొనసాగుతుంది. కో-విన్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్ట్రేషన్‌తో సహా ప్రోగ్రామాటిక్ సెట్టింగ్‌ల కోసం సరఫరా మరియు ఆరు నెలల ప్రాతిపదికన భద్రతా డేటాను సమర్పించడం కొనసాగించడానికి షరతులు ఉన్నాయి, ఇక‌, సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉంద‌ని తెలుస్తుండ‌గా.. దీనికి ల‌ద‌నంగా రూ.150 సేవా రుసుము ఉండే అవ‌కాశం ఉందంటున్నారు.. ఇప్పుడు ప్రైవేటులో కోవాగ్జిన్ ఒక డోసు ధర రూ.1200, కోవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉండ‌గా.. వీటి ధ‌ర భారీగా త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి….