దేశంలో 166.03 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ..

దేశంలో 166.03 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ…
R9TELUGUNEWS.COM..కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. సోమవారం నాటికి దేశంలో 166.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంట్లలోనే 28 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 94.37 శాతంగా అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,09,918 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 15.75 శాతంగా అధికారులు తెలిపారు…