48 గంటల్లో కరోనా ఖతం… ముక్కులో స్ప్రే చేస్తే చాలు..!!

ఈ మందు ముక్కులో స్ప్రే చేసిన తర్వాత 48 గంటల్లో కరోనా నుండి కోలుకుంటారు అని సంస్థ తెలిపింది….
దేశీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మా కెనడియన్ బయోటెక్ సంస్థ సనోటైజ్ సహకారంతో ఈ నాసల్ స్ప్రేని విడుదల చేసింది.ఈ నాసల్ స్ప్రే పేరు ఫాబిస్ప్రే…రితమైనది.కరోనా సోకిన 18 ఏళ్లు పైబడిన బాధితులు ఈ స్ప్రేని ఉపయోగించవచ్చు. స్ప్రే వాడ‌కంలోకి తెచ్చేముందు ముందు కంపెనీ. భారతదేశంలోని 20 ఆసుపత్రులలో 306 మంది రోగులను అధ్యయనం చేసింది..కంపెనీ ప్రకటన ప్రకారం మూడవ దశ ట్రయల్‌లో, ఈ స్ప్రే వాడకం వల్ల 24 గంటల్లో..వైరస్ ఉన్న దాదాపు 94% తగ్గుతుందని కనుగొనబడింది. అదే సమయంలో, వైరల్ లోడ్ 48 గంటల్లో 99% తగ్గుతుంది.
అంటే, వైరస్ బలహీనంగా మారుతుంది. శ్వాసకోశంలోనే తటస్థమవుతుంది.
ఈ స్ప్రే కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా మరియు ఎప్సిలాన్ వేరియంట్‌లను 2 నిమిషాల్లో నాశనం చేయగలదని యూఎస్ఏలో చేసిన ఒక అధ్యయనంలో తేలింద‌ని కంపెనీ పేర్కొంది.గ్లెన్‌మార్క్ ఫార్మా భారతదేశంలో ఈ ఔష‌ధం విక్రయించడానికి డ్రగ్ కంట్రోలర్ అనుమతిని పొందింది.ఈ ఔషధం ఇజ్రాయెల్, థాయిలాండ్, బహ్రెయిన్, ఇండోనేషియా, సింగపూర్‌లో కూడా విక్రయించబడుతుంది. ఫాబిస్ప్రే భారతదేశంలో రూ.850కి అందుబాటులో ఉంటుంది.కంపెనీ తెలిపిన వివ‌రాల ప్రకారం కరోనా సోకిన రోగికి ఒక బాటిల్ కరోనావైరస్ నాసల్ స్ప్రే సరిపోతుంది…