చైనీయులను వణికిస్తున్నా కరోనా….

చైనీయులను క్వారంటైన్‌ కేంద్రాలు వణికిస్తున్నాయి. తాజాగా బీజింగ్‌లో 200 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ బాధితులు సిటీ సెంటర్‌ హెవెన్‌ సూపర్ మార్కెట్‌ బార్‌కు వెళ్లినట్టు తేలడంతో ప్రభుత్వం ఏకంగా వేలాది మందిని ఇళ్లలో నిర్బంధించింది. పెద్ద ఎత్తున ప్రజలకు కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. గతవారమే బీజింగ్‌లో కరోనా నియమాలను సడలించిన చైనా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
అయినా నెగిటివ్‌ రిపోర్టు చూపించినా బీజింగ్‌ అధికారులు మాత్రం బలవంతంగా క్వారంటైన్‌ కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు…చైనా రాజధాని బీజింగ్‌, ఆర్థిక రాజధాని షాంఘై ఈ నగరాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వారం రోజుల క్రితం కోవిడ్‌ ఆంక్షలను చైనా ప్రభుత్వం క్రమంగా సడలించి చివరికి ఎత్తి వేసింది. నెలల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి నిబంధనలు ఎత్తివేసి వారం, పది రోజులు గడిచిందో లేదో అంతలోనే మళ్లీ కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం బీజింగ్‌ ప్రావిన్స్‌లోని చాయోయాంగ్‌లోని సెంట్రల్‌ హెవెన్‌ సూపర్‌ మార్కెట్‌ పరిధిలో 147 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా అధికారులు జూలు విదిల్చారు. 35 లక్షల జనాభా ఉన్న చాయోయాంగ్‌ అంతటా పెద్ద ఎత్తున ప్రజలకు కరోనా టెస్టులను చేయడం ప్రారంభించారు. ఓ వ్యక్తికి ఒక్కసారి టెస్ట్‌ చేస్తే వైరస్‌ పట్టుబడుతుందో లేదోనని చైనా అధికారులు భావించారమో ఏకంగా ఒక్కో వ్యక్తికి రోజుకు మూడు సార్లు చొప్పున టెస్టులు నిర్వహిస్తూ చైనా అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు. ఇక టెస్టుల్లో ఎక్కడ పాజిటివ్‌ వస్తుందోనని ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు…