షాకింగ్‌ న్యూస్… మృత‌దేహంలో 41 రోజుల‌పాటు క‌రోనా…

R9TELUGUNEWS.COM…
ప్ర‌పంచంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త త‌గ్గుతున్న‌ప్ప‌టికీ ఎప్పుడు ఎలా కొత్త వేరియంట్, వేవ్ రూపంలో విజృంభిస్తుందో అనే భ‌యంతో శాస్త్ర‌వేత్త‌లు నిత్యం అల‌ర్ట్‌గా ఉంటున్నారు. క‌రోనాపై ప‌రీక్ష‌లు, ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా మృత‌దేశంలో క‌రోనా ఎంత‌కాలం ఉంటుంది అనే దానిపై జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో షాకిచ్చే న్యూస్ తెలిసింది. క‌రోనాతో మృతి చెందిన ఓ వ్య‌క్తి శ‌రీరానికి 41 రోజుల‌పాటు 28 సార్లు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 41 రోజుల‌పాటు మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా ఉన్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు నిర్ధారించారు.41 రోజుల‌పాటు త‌రువాత డెడ్‌బాడీని ఖ‌న‌నం చేయ‌డంతో నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అయితే, మృతి చెందిన వ్య‌క్తి నుంచి క‌రోనా ఇత‌రుల‌కు సోకుతుంద‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆధారాలు లేవు. గ‌తంలో మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ 35 గంట‌ల‌కు మించి జీవించి ఉండ‌లేద‌ని తేల‌గా, ఇప్పుడు 41 రోజుల‌పాటు మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ‌కు రావ‌డంతో ఈ దిశ‌గా ప‌రిశోధ‌కులు లోతైన ప‌రిశోధ‌ను చేస్తున్నారు…