కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి…లేఖ‌లు రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ‌.

ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని, రాష్ట్రాల‌న్నీ అప్ర‌మ‌త్త‌త‌తోనే వుండాల‌ని కేంద్రం సూచించింది. ఆగ్నేయాసియా, యూర‌ప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దేశంలోకి నాలుగో వేవ్ రాకుండా టెస్టులు, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌, వ్యాక్సినేష‌న్ లాంటి వాటిపై దృష్టి పెడుతూనే వుండాల‌ని కేంద్రం అన్ని రాష్ట్రాల‌కూ సూచించింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శా ఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. కొత్త వేరియంట్లను గుర్తించ‌డం, వ్యాక్సినేష‌న్ చేసుకునేలా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం లాంటి వాటిపై రాష్ట్రాల‌న్నీ దృష్టి పెట్టాల‌న్నారు.
ప్ర‌జ‌లంద‌రూ మాస్కులు ధ‌రించేలా అవ‌గాహన క‌ల్పించాల‌ని, కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని కేంద్రం రాష్ట్రాల‌కు సూచించింది. భౌతిక దూరం, మాస్కులు ధ‌రించిండం, చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం లాంటి ప‌నుల‌ను చేసేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేంద్రం పేర్కొంది…