దేశవ్యాప్తంగా మళ్లీ 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పైగా చిన్నారులకు కరోనా సోకుతుండడం మృతుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో టెన్షన్ మొదలయింది. ఫోర్త్ వేవ్ మప్పు జూన్ కంటే ముందే వస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు తక్కువగా ఉన్నాయని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా అంతంత మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ, యూపీ, హర్యానా,మహారాష్ట్ర,మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. తాజా పరిస్థితులతో మళ్లీ కరోనా ఆంక్షలు మొదలవుతాయేమోనన్న భయం ప్రజల్లో పెరుగుతోంది..2వేల కేసులకే 214 మంది చనిపోగా 24 గంటల్లో కొత్తగా 2వేల కేసులు నమోదుకాగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కేసులు అధికంగా వస్తున్న ఐదు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో అత్యవసర చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ కోరారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వాక్సిన్ అనే ఐదు పద్ధతులను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.