దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు….

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మారి బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య మొత్తం 5,24,630కు చేరింది.2134 మంది బాధితులు వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,15,574 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,883 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 13,33,064 డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,93,45,95,805 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది…