దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు .. నేడు నమోదైన కేసుల వివరాలు..!!!

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 8వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 40వేలు దాటింది. 24గంటల్లో 8,329మంది కొవిడ్‌ బారిన పడగా.. 10 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,13,435కి చేరగా.. మహమ్మారి బారిన పడి ఇంత వరకు 5,24,757 మంది మరణించారు. మరో 4,216 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 40,370కి చేరాయి. ఇప్పటివరకు 194.92 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.