స్కూల్ పిల్లలకు టీకా పంపిణీ వేగాన్ని పెంచాలి..కేంద్ర ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయా ఆదేశాలు…

కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు చేశారు… తాజాగా, కేంద్ర ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని, స్కూల్ పిల్లలకు టీకా పంపిణీ వేగాన్ని పెంచాలని తెలిపారు. వయోధికులకూ బూస్టర్ షాట్లు ఇవ్వాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మరోసారి బలోపేతం చేయాలని అన్నారు…కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు కాబట్టి, కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తప్పకుండా అమలు చేయాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుదలను ఆయన ప్రస్తావించారు. టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, తద్వార కేసు ఉధృతిని అంచనా వేయడానికి ఆస్కారం కలుగుతుందని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం కుదురుతుందని అన్నారు. అదే విధంగా జీనోమ్ సీక్వెన్సింగ్ పైనా ఫోకస్ పెట్టాలని, తద్వార వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు, మ్యూటేంట్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.