దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు…!!

కరోనా వైరస్ మళ్లీ కేసులో పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి సైలెంట్‌గా విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 17వేల 3వందల 36 కేసులు నమోదయ్యాయి… థర్డ్‌వేవ్‌ తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం దేశంలో 88వేల 2వందల 84 యాక్టీవ్ కేసులు ఉన్నాయి… ప్రతీ ఒక్కరు తప్పని సరిగా మాస్క్ లు వాడాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి..కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది…