కొత్తగా 9,531 కరోనా కేసులు నమోదు….!!

భారత్​లో కరోనా మహమ్మారి ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. తాజాగా కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 9,531 మందికి కొవిడ్ సోకినట్లు వైద్యశాఖ వెల్లడించింది.36 మంది కరోనాతో మరణించినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం ఉంది.భారత్​లో మొత్తం కరోనా కేసులు-44,348,960, క్రియాశీల కేసులు- 97,648, మొత్తం మరణాలు – 5,27,368, కోలుకున్నవారు – 4,37,23,944.
భారత్​లో ఆదివారం 35,33,466 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,10,02,40,361కు చేరింది. ఒక్కరోజే 2,29,546 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజే 5,51,288 కేసులు వెలుగుచూశాయి. దాదాపు 908 మంది చనిపోయారు. మొత్తం కేసులు 60,08,28,427కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 64,71,809మంది మరణించారు. ఒక్కరోజే 703,657 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,50,66,049కు చేరింది.