దేశంలో కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పెరుగుతున్న మరణాలు….

R9TELUGUNEWS.COM దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 3 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కరోనా మరణాలు మాత్రం రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.దేశంలో కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరాయి. ఇందులో 3,95,11,307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 16,21,603 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,97,975 మంది మృతిచెందారు.కాగా, గత 24 గంటల్లో 2,81,109 కోలుకోగా, 1733 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివీ రేటు 9.26 శాతానికి తగ్గిందని తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు 167.29 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.