భారత్ లో తగ్గుతున్న కరోనా వైరస్ కేసులు..

భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా లక్షకు దిగువగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఇప్పుడు మరోసారి తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 67,084 మందికి కరోనా సోకినట్లు తేలింది…దీంతో దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 4.4 శాతానికి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నా.. మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. .కేరళలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 854 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా ధాటికి దేశ వ్యాప్తంగా 5.06 లక్షల మంది మృతి చెందారు. కరోనా మరణాల్లో మహారాష్ట్ర (1.43 లక్షలు), కేరళ (60,793) ముందున్నాయి.