చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. 6000 బెడ్స్‌తో తాత్కాలిక‌ హాస్పిట‌ల్ నిర్మాణం..

*చైనాలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. 6000 బెడ్స్‌తో తాత్కాలిక‌ హాస్పిట‌ల్ నిర్మాణం*

కరోనా పుట్టినిల్లు చైనాలో మ‌రోసారి క‌రోనా విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. అస‌లు క‌రోనా అంటేనే మ‌న‌కు తెలియ‌ని స‌మ‌యంలో చైనాలో తొలిసారి క‌రోనా విజృంభించింది. చైనాలోని వూహాన్‌లో క‌రోనా వైర‌స్ పుట్ట‌గా.. ఆ త‌ర్వాత ప్ర‌పంచ దేశాల‌కు పాకింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో పోరాడుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ కూడా ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌ను చేసింది.
తాజాగా మ‌రోసారి చైనాపై క‌రోనా త‌న పంజాను విసిరింది. గ‌త కొన్ని రోజుల నుంచి చైనాలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో 2020 ప‌రిస్థితిని ముందే ఊహించి.. వెంట‌నే 6000 బెడ్స్‌తో తాత్కాలిక హాస్పిట‌ల్ నిర్మాణాన్ని చైనా ప్ర‌భుత్వం ప్రారంభించింది. చైనాలోని జిలిన్ సిటీలో హాస్పిట‌ల్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది…కేవ‌లం 6 రోజుల్లోనే 6000 బెడ్స్‌తో ఈ హాస్పిట‌ల్‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం అయింది*. జిలిన్ సిటీలో హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నులు ప్రారంభం అయ్యాయి. జిలిన్ ప్రావిన్స్‌లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా సోమ‌వారం 2300 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఆదివారం మాత్రం 3400 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. *కోవిడ్ 19 హాట్‌స్పాట్స్‌గా ఉండే ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. షాంగైలో స్కూల్స్, రెస్టారెంట్స్‌, షాపింగ్ మాల్స్ అన్నీ టెంప‌ర‌రీగా మూత‌ప‌డ్డాయి.