భారత్ లొ మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

భారత్‌లో తగ్గుముఖం పట్టిన కోవిడ్‌ కేసులు ఇప్పుడు అనూహ్యంగా పెరగడం కాస్త కలవర పెడుతోంది. దేశంలో ఉన్నట్టుండి కరోనా కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. కొత్తగా 2 వేల 183 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 214 మంది కోల్పోయారు. నిన్న 19వందల 85 మందిప్రాణాలు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.
ఇక దేశంలో మొత్తం 4 కోట్ల 30 లక్షల 44 వేల 280 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 4 కోట్ల 25 లక్షల 10 వేల 773 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 5 లక్షల 21 వేల 965 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11వేల 542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.