కాంగ్రెస్ కంటే రోటీ మేక‌ర్‌ గుర్తుకే ఎక్కువ ఓట్లు..

కాంగ్రెస్ కంటే రోటీ మేక‌ర్‌ గుర్తుకే ఎక్కువ ఓట్లు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో 122 ఓట్లు వ‌చ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేక‌ర్.. ఇది కారు గుర్తును పోలి ఉండ‌టం పెద్ద క‌న్ఫ్యూజ‌న్‌ను క్రియేట్ చేసింద‌ని చెప్పొచ్చు. అదే కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్‌కు 119 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి.