తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమక్షంలో బాలకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది.
హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి గురువారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.